కార్పొరేట్‌ పన్నుల వసూళ్లలో 34% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నుల్లో 34 శాతం వృద్ధి ఉందని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. తక్కువ పన్ను రేట్లతో పన్నుల విధానాన్ని సరళీకరించడం ఫలితమిస్తోందనే సంకేతాన్ని ఇది తెలియజేస్తోందని ట్వీట్‌ చేసింది. అయితే ఎంత మేర వసూళ్లయ్యాయనే

Published : 14 Aug 2022 03:05 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నుల్లో 34 శాతం వృద్ధి ఉందని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. తక్కువ పన్ను రేట్లతో పన్నుల విధానాన్ని సరళీకరించడం ఫలితమిస్తోందనే సంకేతాన్ని ఇది తెలియజేస్తోందని ట్వీట్‌ చేసింది. అయితే ఎంత మేర వసూళ్లయ్యాయనే గణాంకాలను మాత్రం వెల్లడించలేదు. మినహాయింపులను వద్దనుకోవడం ద్వారా 30 శాతం నుంచి 22 శాతం పన్ను రేటుకు మారే అవకాశాన్ని 2019 సెప్టెంబరులో కంపెనీలకు ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీలకు పన్ను రేట్లను తగ్గించడం వల్ల కేంద్రానికి ఆదాయం తగ్గుతుందని, దీని వల్ల సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందనే విమర్శలు ఆ సమయంలో వచ్చాయి. ఈ విమర్శలకు సమాధానంగా తాజా వసూళ్లను చూపించాలనే ఉద్దేశం ఐటీ విభాగం చేసిన తాజా ప్రకటన ద్వారా కనిపిస్తోంది. 2021-22లో కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.7.23 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని వసూళ్లతో పోలిస్తే 58 శాతం వృద్ధి ఉంది. కొవిడ్‌-19 పరిణామాల ముందు ఆర్థిక సంవత్సరమైన 2018-19తో పోలిస్తే 2021-22లో కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు 9 శాతం పెరిగాయని ఐటీ విభాగం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే సానుకూల ధోరణి కొనసాగొచ్చని పేర్కొంది.


ఎస్‌ఎంఎస్‌ ఫార్మాకు నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్‌ఎంఎస్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.65.19 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీనిపై రూ.9.79 కోట్ల నికరనష్టం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.164.28 కోట్లు, నికరలాభం రూ.23.14 కోట్లు ఉండటం గమనార్హం. యాంటీ-రెట్రోవైరల్‌ ఔషధాల అమ్మకాలు తగ్గిపోవటంతో త్రైమాసిక ఆదాయాలు క్షీణించినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా సొంతంగా అభివృద్ధి చేసిన ఔషధాలు కొన్నింటిని విక్రయించటం ద్వారా ఆదాయాలు, లాభాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని