9% వృద్ధితోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ

మనదేశం 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.395 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారడానికి, వచ్చే అయిదేళ్ల పాటు ఏటా 9 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఈ ఘనతను 2028-29 లోపు చేరుకోలేకపోవచ్చని అన్నారు. ‘75 ఏళ్ల స్వతంత్ర

Updated : 16 Aug 2022 06:36 IST

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశం 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.395 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారడానికి, వచ్చే అయిదేళ్ల పాటు ఏటా 9 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఈ ఘనతను 2028-29 లోపు చేరుకోలేకపోవచ్చని అన్నారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతావని- 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై సోమవారం ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే పెట్టుబడులు పెరగడం, ఉత్పాదకత పెంపు, విద్య, వైద్య సదుపాయాల విస్తృతి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపొందించడం, సమర్థ ప్రభుత్వ పాలన, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోవడం ముఖ్యమ’ని వివరించారు. గత 75 ఏళ్లలో మనదేశం ఎన్నో విజయాలు సాధించినా, ఇంకా 20 కోట్ల మంది ప్రజలు నిరుపేదలుగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. సత్వర అభివృద్ధి సాధించడం కోసం చేపట్టే కార్యక్రమాల్లో 60 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. దేశంలో ఏటా 1.2 కోట్ల మంది యువకులు ఉద్యోగాల విపణిలోకి వస్తున్నారని, ఇంతమందికి ఉద్యోగాలు ఉత్పత్తి రంగంలోనే సాధ్యమవుతుంది కానీ వ్యవసాయ/ సేవల రంగాల వల్ల కాదని తెలిపారు.

సబ్సిడీలపై చర్చ ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పని చేశారని దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. సబ్సిడీల భారం పెరిగిపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కారణమేనని అన్నారు.  సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి చేయూత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అప్పులు చేసి మరీ ఉచిత పథకాలు అమలు చేయడం సమంజసం కాదని తెలిపారు.

మనదేశం ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని, తలసరి ఆదాయం 1960లో 82 డాలర్లు కాగా, ఇప్పుడు 2,000 డాలర్లకు మించిందని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్‌ అగర్వాల్‌ అన్నారు. వచ్చే 75 ఏళ్లలో ఇంకా అభివృద్ధి చెందుతామని ఎఫ్‌టీసీసీఐ ఐడీసీ కమిటీ ఛైర్మన్‌ గరిమెళ్ల శ్రీనివాస్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts