ఓలా విద్యుత్తు కారుతో 500 కి.మీ. ప్రయాణం

ఓలా ఎలక్ట్రిక్‌ ‘ఓలా ఎస్‌1’ పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం ఆవిష్కరించింది. రూ.99,999 ప్రారంభ ధరతో అమ్మకాలు త్వరలో చేపడతామని తెలిపింది.  రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్‌ కారును 2024లో ఆవిష్కరిస్తామని కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌

Published : 16 Aug 2022 03:18 IST

2024లో తీసుకొస్తాం

ఎస్‌1 స్కూటర్‌ ఆవిష్కరణలో సీఈఓ భవీశ్‌  

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ ‘ఓలా ఎస్‌1’ పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం ఆవిష్కరించింది. రూ.99,999 ప్రారంభ ధరతో అమ్మకాలు త్వరలో చేపడతామని తెలిపింది.  రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్‌ కారును 2024లో ఆవిష్కరిస్తామని కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 4 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. తమిళనాడులోని పోచంపల్లిలో 100 ఎకరాల్లో లిథియం అయాన్‌ సెల్‌ ప్లాంట్‌, 200 ఎకరాల్లో ఈవీ కార్‌ ప్లాంట్‌, 40 ఎకరాల్లో ఈవీ స్కూటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏడాదికి 10 లక్షల విద్యుత్‌ కార్లు, కోటి ద్విచక్ర వాహనాలు, 100 గిగావాట్‌ అవర్‌ బ్యాటరీ సెల్స్‌ ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యమని భవీశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని