పసిడి, రాగి ఆకర్షణీయమే!

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం కొంత సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే రూ.52,041 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింతగా పడిపోవచ్చు. రూ.52,596 పైన కదలాడితే రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.52,075 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.52,596 ఎగువన లాంగ్‌ పొజిషన్లు

Published : 16 Aug 2022 03:18 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

సిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం కొంత సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే రూ.52,041 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింతగా పడిపోవచ్చు. రూ.52,596 పైన కదలాడితే రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.52,075 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.52,596 ఎగువన లాంగ్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిదే.

* ఎంసీఎక్స్‌ బులియన్‌ ఇండెక్స్‌ ఆగస్టు కాంట్రాక్టు రూ.14,588 కంటే పైన చలిస్తే రూ.14,686; రూ.14,795 వరకు రాణించవచ్చు.  


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టు కిందకు వస్తే రూ.57,933 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.56,567కి దిగి రావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.60,042 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనినీ అధిగమిస్తే రూ.60,785 వరకు పెరగొచ్చు.  


ప్రాథమిక లోహాలు

* రాగి ఆగస్టు కాంట్రాక్టు రూ.681 కంటే పైన కదలాడితే సానుకూలతకు అవకాశం ఉంటుంది. రూ.664 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ, రూ.671 కంటే పైన లాంగ్‌ పొజిషన్లకు మొగ్గు చూపడం మంచిదే.

* సీసం ఆగస్టు కాంట్రాక్టు రూ.182 కంటే దిగువన చలిస్తే మరింతగా పడిపోవచ్చు. అయితే సానుకూల ధోరణి కొనసాగేందుకూ ఆస్కారం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ట్రేడ్‌ చేయాలి.

* జింక్‌ ఆగస్టు కాంట్రాక్టు రూ.318 కంటే పైన కదలాడితే.. కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు. రూ.313ను స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.

* అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టు రూ.217.75 కంటే పైన కదలాడకుంటే.. కొంత అమ్మకాల ఒత్తిడికి లోనవ్వచ్చు.


ఇంధన రంగం

* ముడి చమురు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.7,009 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోళ్లు చోటుచేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువన చలిస్తే రూ.6,688;   రూ.6,564 వరకు దిద్దుబాటు కావచ్చు.

*  సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టు రూ.608 కంటే ఎగువన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పైకి వెళితే రూ.636.50 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.756 వరకు పెరగొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

*  పసుపు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.7,111 కంటే దిగువన కదలాడకుంటే.. గతవారం గరిష్ఠమైన రూ.7,746 వరకు పెరగొచ్చు.

*  జీలకర్ర సెప్టెంబరు కాంట్రాక్టు రూ.24,996 కంటే పైన కదలాడితే మరింతగా పెరగొచ్చు. అందువల్ల ఈ స్థాయికి దిగువన షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండటమే మంచిది.

 ధనియాలు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.11,382 కంటే దిగువన చలిస్తే, మరింతగా దిద్దుబాటు కావచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని