స్కోడా బ్రాండ్‌ కింద విద్యుత్‌ కార్లు

భారత విపణి కోసం స్కోడా బ్రాండ్‌ కింద విద్యుత్‌ కార్లు తీసుకొచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్లను పరీక్షించడం ప్రారంభించామని.. ఎక్కువ అమ్మకాలు ఉండే మోడళ్లే లక్ష్యంగా కార్లను మదింపు చేస్తున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా ఎండీ పీయూశ్‌ అరోరా పేర్కొన్నారు.

Published : 16 Aug 2022 03:18 IST

ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సన్నాహాలు

దిల్లీ: భారత విపణి కోసం స్కోడా బ్రాండ్‌ కింద విద్యుత్‌ కార్లు తీసుకొచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్లను పరీక్షించడం ప్రారంభించామని.. ఎక్కువ అమ్మకాలు ఉండే మోడళ్లే లక్ష్యంగా కార్లను మదింపు చేస్తున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా ఎండీ పీయూశ్‌ అరోరా పేర్కొన్నారు. ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ (ఐసీఈ) వాహనాలపై కూడా దృష్టి కొనసాగిస్తామని, దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారంగా విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తామని అన్నారు. భారత్‌లో విద్యుత్‌ కార్లకు గిరాకీని గుర్తించామని, ఇప్పటికే విడుదల చేసిన పోర్షే టేకాన్‌, ఆడి ఇ-ట్రాన్‌ కార్లు రాణిస్తున్నట్లు వెల్లడించారు. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌ విద్యుత్‌ మోడళ్లను కూడా తీసుకొచ్చేందుకు చూస్తున్నామని, సరైన సమయంలో భారత విపణిలో ప్రవేశపెడతామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని