మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ నుంచి కేకేఆర్‌ బయటకు

మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో తనకున్న 27 శాతం వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ ఈనెల 16న విక్రయించనుందని సమాచారం. ఈ లావాదేవీ ద్వారా కేకేఆర్‌ రూ.9,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో ఈ వాటాను కేకేఆర్‌కు చెందిన కయాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కలిగి ఉంది. బల్క్‌డీల్‌ ద్వారా

Published : 16 Aug 2022 03:18 IST

27% వాటాకు రూ.9,000 కోట్లు

దిల్లీ: మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో తనకున్న 27 శాతం వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ ఈనెల 16న విక్రయించనుందని సమాచారం. ఈ లావాదేవీ ద్వారా కేకేఆర్‌ రూ.9,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో ఈ వాటాను కేకేఆర్‌కు చెందిన కయాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కలిగి ఉంది. బల్క్‌డీల్‌ ద్వారా 26.7 కోట్ల మ్యాక్స్‌కేర్‌ హెల్త్‌కేర్‌ షేర్లను ఒక్కోటి రూ.350- 361.90 చొప్పున కయాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మంగళవారం విక్రయించనుంది. గత శుక్రవారం మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ షేరు ముగింపు ధర రూ.361.55.  ప్రాథమికంగా 20 శాతం లేదా 19.3 కోట్ల షేర్లను కయాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విక్రయించనుంది. ఆ తర్వాత దీనిని మరో 6.83 శాతానికి లేదా 6.6 కోట్ల షేర్లకు పెంచుకునే అవకాశాన్ని కూడా కలిగి ఉంటుంది. 2018లో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ షేర్లను ఒక్కోటి రూ.80 చొప్పున కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని