వడ్డీ రేట్లు తగ్గించిన చైనా

చైనా కేంద్ర బ్యాంకు కీలక రేట్లను తగ్గించింది. బలహీనమవుతున్న ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రుణ ఆందోళనలను తాత్కాలికంగా పక్కన పెట్టొచ్చని ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. మూడో సారి అధికారం చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్న జిన్‌పింగ్‌, అందుకు సానుకూల

Published : 16 Aug 2022 03:18 IST

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే

బీజింగ్‌: చైనా కేంద్ర బ్యాంకు కీలక రేట్లను తగ్గించింది. బలహీనమవుతున్న ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రుణ ఆందోళనలను తాత్కాలికంగా పక్కన పెట్టొచ్చని ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. మూడో సారి అధికారం చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్న జిన్‌పింగ్‌, అందుకు సానుకూల పరిస్థితులు ఏర్పరచుకునేందుకే ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు. కరోనాను అదుపులో ఉంచడానికి చేపట్టిన చర్యల కారణంగా వాణిజ్యం, తయారీ, వినియోగదారు వ్యయాలపై ప్రభావం పడింది. ఈ ఏడాది వృద్ధి లక్ష్యమైన 5.5 శాతాన్ని చేరలేమని అధికార పార్టీ గ్రహించింది. స్థిరాస్తి రంగంలోనూ గృహ విక్రయాలు తగ్గాయి. ఆర్థిక రికవరీ మందగమనం పాలవుతోందని స్వయానా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఏడాది రుణాలపై వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. తద్వారా మార్కెట్లోకి అదనంగా 400 బిలియన్‌ యువాన్‌ల(60 బిలియన్‌ డాలర్ల)ను జొప్పించినట్లయింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని