హైదరాబాద్‌లో 8 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 5 శాతం పెరిగాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ఠంగా 10 శాతం ధరలు పెరగ్గా...హైదరాబాద్‌లో 8 శాతం వార్షిక వృద్ధి ఇళ్ల ధరల్లో కన్పించింది.  క్రెడాయ్‌, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, డాటా విశ్లేషణ సంస్థ లీసెస్‌ ఫోరస్‌  ఏప్రిల్‌- జూన్‌

Updated : 17 Aug 2022 11:56 IST

క్రెడాయ్‌ నివేదిక

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 5 శాతం పెరిగాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ఠంగా 10 శాతం ధరలు పెరగ్గా...హైదరాబాద్‌లో 8 శాతం వార్షిక వృద్ధి ఇళ్ల ధరల్లో కన్పించింది.  క్రెడాయ్‌, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, డాటా విశ్లేషణ సంస్థ లీసెస్‌ ఫోరస్‌  ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి సంబంధించి దేశంలోని 8 నగరాలకు సంబంధించి హౌస్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ 2022ను తాజాగా విడుదల చేశాయి. అహ్మదాబాద్‌లో 9%, కోల్‌కతాలో 8%, పుణెలో 5%, బెంగళూరులో 4 శాతం ధరలు పెరిగాయి. ముంబయిలో అత్యల్పంగా ఒక శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరిగాయి. కార్పెట్‌ విస్తీర్ణం ఆధారంగా ధరల వృద్ధిని విశ్లేషించామని.. హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.9218 చేరిందని నివేదికలో పేర్కొన్నారు. కూలీలు వేతనాలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడమే ఇళ్ల ధరలు పెరగడానికి కారణమని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్ష వర్ధన్‌ పటోడియా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని