ఈ ఏడాది వేతనాల్లో 10% పెంపు!

భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని ఒక నివేదిక అంచనా వేస్తోంది. వలసలు పెరుగుతుండడంతో సిబ్బంది లభ్యత కష్టంగా మారడం ఇందుకు నేపథ్యమని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన ‘శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌’ నివేదికలో వెల్లడైంది.

Published : 17 Aug 2022 04:33 IST

భారత కంపెనీలు చేపట్టే అవకాశం

ఆసియా పసిఫిక్‌లోనే అత్యధికం

విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక వెల్లడి

ముంబయి: భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని ఒక నివేదిక అంచనా వేస్తోంది. వలసలు పెరుగుతుండడంతో సిబ్బంది లభ్యత కష్టంగా మారడం ఇందుకు నేపథ్యమని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన ‘శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌’ నివేదికలో వెల్లడైంది. 168 దేశాల్లోని 590 కంపెనీలపై ఏప్రిల్‌-మే 2022లో జరిపిన సర్వే ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

* 2021-22లో పెరిగిన 9.5 శాతం వేతనాలతో పోలిస్తే 2022-23లో అంతకంటే ఎక్కువగా 10 శాతం మేర భారత్‌లో జీతాలు పెరగొచ్చు.

* గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగం కంపెనీలు పైగా(58%) అధిక వేతనాల పెంపునకు బడ్జెట్‌ను కేటాయించాయి.

* ఇక పావు వంతు(24.4%) మాత్రం యథాతథ బడ్జెట్‌ను కొనసాగించనున్నాయి.

* కేవలం 5.4 శాతం సంస్థలు మాత్రం 2021-22తో పోలిస్తే కాస్త బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి.

* భారత్‌లో నమోదుకానున్న 10 శాతం వేతన పెంపు ఆసియా పసిఫిక్‌(ఏపీఏసీ) ప్రాంతంలోనే అత్యధికం కావడం విశేషం.

* భారత్‌తో పోలిస్తే చైనా(6%), హాంకాంగ్‌(4%), సింగపూర్‌(4%)లు తక్కువ పెంపునే చేపడుతున్నాయి.

* భారత్‌లోని 42 శాతం మేర కంపెనీలు వచ్చే 12 నెలల్లో సానుకూల ఆదాయ అంచనాలను అంచనా వేశాయి. కేవలం 7.2 శాతం మాత్రమే ప్రతికూల అంచనాలను వెలువరిచాయి.

వీటిలో నియామకాలు..: ఐటీ (65.5%), ఇంజినీరింగ్‌(52.9%), విక్రయాలు(35.4%), సాంకేతిక నైపుణ్యం(32.5%), ఆర్థిక(17.5%) విభాగాల్లో వచ్చే 12 నెలల్లో నియామకాలు జరగనున్నాయి. స్వచ్ఛంద వలసల రేటు సైతం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో హాంకాంగ్‌ తర్వాత అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగనుంది. ఇక ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌-సాంకేతికత, మీడియా-గేమింగ్‌ రంగాల్లో వరుసగా 10.4%, 10.2%, 10 శాతం చొప్పున వేతన పెంపులు కనిపించొచ్చని ఆ సర్వే అంటోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని