వోఖార్డ్‌ నుంచి కొత్త యాంటీ-బయాటిక్‌

ఒక నూతన యాంటీ-బయాటిక్‌ ఔషధంపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను వోఖార్డ్‌ లిమిటెడ్‌ ప్రపంచ వ్యాప్తంగా చేపట్టింది. ‘డబ్లూసీకే 5222’ అనే ఈ ఔషధం, ‘బి-లాక్టమ్‌ ఎన్‌హేన్సర్‌’ అనే నూతన తరగతికి చెందినదని, సంక్లిష్టమైన మూత్ర నాళం ఇన్ఫెక్షన్లతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన వారికి ఇది అనువైన ఔషధమని సంస్థ వెల్లడించింది

Published : 17 Aug 2022 04:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒక నూతన యాంటీ-బయాటిక్‌ ఔషధంపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను వోఖార్డ్‌ లిమిటెడ్‌ ప్రపంచ వ్యాప్తంగా చేపట్టింది. ‘డబ్లూసీకే 5222’ అనే ఈ ఔషధం, ‘బి-లాక్టమ్‌ ఎన్‌హేన్సర్‌’ అనే నూతన తరగతికి చెందినదని, సంక్లిష్టమైన మూత్ర నాళం ఇన్ఫెక్షన్లతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన వారికి ఇది అనువైన ఔషధమని సంస్థ వెల్లడించింది. ‘డబ్లూసీకే 5222 ఒక కొత్త తరం యాంటీ-బయాటిక్‌ ఔషధం. మూత్ర నాళం ఇన్ఫెక్షన్లు, హాస్పిటల్‌లో చేరినప్పుడు సోకే బాక్టీరియల్‌ న్యూమోనియా జబ్బుల చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది’ అని వోఖార్డ్‌ ఛైర్మన్‌ హబీబ్‌ ఖొరైకీవాలా తెలిపారు. ఈ ఔషధంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని పరిశోధనల్లో స్పష్టమవుతున్నట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లోని 70 కేంద్రాల్లో దీనిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను వోఖార్డ్‌ చేపట్టింది. ఈ పరీక్షలు వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో పూర్తవుతాయని ఆశిస్తున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts