యాపిల్‌లో 100 మంది రిక్రూటర్ల కోత

యాపిల్‌ ఇంక్‌ గత వారం వ్యవధిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న 100 మంది వరకు రిక్రూటర్లను తొలగించింది. నియామకాలు, వ్యయాలను అదుపులో ఉంచడం కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. కొత్త ఉద్యోగులను నియమించడానికి

Published : 17 Aug 2022 04:33 IST

యాపిల్‌ ఇంక్‌ గత వారం వ్యవధిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న 100 మంది వరకు రిక్రూటర్లను తొలగించింది. నియామకాలు, వ్యయాలను అదుపులో ఉంచడం కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. కొత్త ఉద్యోగులను నియమించడానికి బాధ్యత వహించే ఈ రిక్రూటర్లనే తొలగించడం అంటే కంపెనీలో నియామకాలు మందగమనం పాలు కానున్నాయని అందులో అంచనా వేసింది. ప్రస్తుత వ్యాపారావసరాల కారణంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు తొలగించిన సిబ్బందికి కంపెనీ తెలిపినట్లు సమాచారం. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఉన్న రిక్రూటర్లను మాత్రం కంపెనీ అట్టేపెట్టుకుంటోంది. ఈ నిర్ణయంపై యాపిల్‌ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని ఆ కథనం పేర్కొంది. 1,50,000 పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో ఇది అసాధారణమే అని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అయితే టెక్‌ వ్యయాల మందగమనం నేపథ్యంలో ఇటీవలి కొద్ది నెలల్లో మెటా ప్లాట్‌ఫామ్స్‌, టెస్లా, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఒరాకిల్‌ కార్ప్‌ వంటి కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని