5 నెలల కనిష్ఠానికి టోకు ధరలు

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జులైలో 13.93 శాతంగా నమోదైంది. ఇది 5 నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. డబ్ల్యూపీఐ తగ్గడం వరుసగా ఇది రెండో నెల కావడం గమనార్హం. దీంతో రానున్న నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగొచ్చన్న

Published : 17 Aug 2022 04:33 IST

జులైలో డబ్ల్యూపీఐ 13.91 శాతం

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జులైలో 13.93 శాతంగా నమోదైంది. ఇది 5 నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. డబ్ల్యూపీఐ తగ్గడం వరుసగా ఇది రెండో నెల కావడం గమనార్హం. దీంతో రానున్న నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగొచ్చన్న ఆశాభావాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో డబ్ల్యూపీఐ రికార్డు గరిష్ఠమైన 15.88 శాతాన్ని తాకగా.. జూన్‌లో 15.18 శాతానికి దిగివచ్చింది. కిందటేడాది జులైలో ఇది 11.57 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. గత 16 నెలలుగా అంటే కిందటేడాది ఏప్రిల్‌ నుంచి రెండంకెల స్థాయిలో డబ్ల్యూపీఐ నమోదవుతూ ఉండటం గమనార్హం. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతంగా ఉండగా.. జులైలో 10.77 శాతానికి పరిమితమైంది. కూరగాయల ద్రవ్యోల్బణ రేటు 56.75 శాతం నుంచి గణనీయంగా 18.25 శాతానికి దిగివచ్చింది. అయితే ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణ రేటు 40.38 శాతం నుంచి 43.75 శాతానికి; తయారీ ఉత్పత్తులు, నూనె గింజల ద్రవ్యోల్బణం -4.06 శాతం నుంచి 8.16 శాతానికి పెరిగింది. సెప్టెంబరు చివరి నాటికి ద్రవ్యోల్బణం పరంగా పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా తెలిపారు. సరఫరా సంబంధిత అవరోధాలు తొలగుతుండటం, ముడి చమురు ధరల తగ్గుముఖం ఇందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో అంకురాల కోసం ప్రత్యేక శాఖను ప్రారంభించిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పై విషయాలు దినేశ్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts