అతిపెద్ద చక్కెర కంపెనీపై ఎస్‌బీఐ దివాలా పిటిషన్‌

దేశంలోనే అతిపెద్ద చక్కెర సంస్థ అయిన బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌పై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఒక దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌కు రుణదాత హోదాలో ఈ పిటిషన్‌ వేసింది. ‘ఎస్‌బీఐ తన అడ్వొకేట్‌ ద్వారా బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌పై కార్పొరేట్‌ దివాలా

Published : 17 Aug 2022 04:33 IST

దిల్లీ: దేశంలోనే అతిపెద్ద చక్కెర సంస్థ అయిన బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌పై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఒక దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌కు రుణదాత హోదాలో ఈ పిటిషన్‌ వేసింది. ‘ఎస్‌బీఐ తన అడ్వొకేట్‌ ద్వారా బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌పై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించినట్లు మా దృష్టికి వచ్చింద’ని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేర్కొంది. దివాలా స్మృతి 2016లోని సెక్షన్‌ 7 కింద ఈ పిటిషన్‌ దాఖలైంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,607 కోట్ల టర్నోవరుపై రూ.267.54 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలోనూ కంపెనీకి రూ.1,538 కోట్ల ఆదాయంపై రూ.45 కోట్ల నికర నష్టం వచ్చింది. కంపెనీకి చెందిన అన్ని 14 చక్కెర ప్లాంట్లన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts