ఆధునికీకరణను అనిశ్చితి ఆపలేదు

వ్యాపార-కీలక సాంకేతికత ఆధునికీకరణను స్థూల ఆర్థిక, భౌగోళిక-రాజకీయ పరిణామాలు అడ్డుకోలేవని మైండ్‌ట్రీ సీఈఓ దేవాశీస్‌ ఛటర్జీ పేర్కొన్నారు. ‘కొన్ని రంగాల్లో నిర్ణయాల వేగంపైవివి కాస్త ప్రభావం చూపొచ్చు కానీ.. వినూత్న పరిష్కారాలను నిలిపేయలేవని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందన్న ఆందోళనల

Published : 17 Aug 2022 04:33 IST

మైండ్‌ట్రీ సీఈఓ దేవాశీస్‌ ఛటర్జీ

దిల్లీ: వ్యాపార-కీలక సాంకేతికత ఆధునికీకరణను స్థూల ఆర్థిక, భౌగోళిక-రాజకీయ పరిణామాలు అడ్డుకోలేవని మైండ్‌ట్రీ సీఈఓ దేవాశీస్‌ ఛటర్జీ పేర్కొన్నారు. ‘కొన్ని రంగాల్లో నిర్ణయాల వేగంపైవివి కాస్త ప్రభావం చూపొచ్చు కానీ.. వినూత్న పరిష్కారాలను నిలిపేయలేవని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఒక ఐటీ కంపెనీ అధిపతి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అయితే కొన్ని అంతర్జాతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ మందగమనంపై అంచనాల మధ్య నియామకాల ప్రణాళికలను వెనక్కి తీసుకుంటున్నాయి. కాగా, తొలి త్రైమాసిక పనితీరు మెరుగ్గా రాణించడంతో మా వృద్ధిపై విశ్వాసం కుదిరిందని ఛటర్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మందగమనం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ఇప్పటిదాకా క్లయింట్ల ధోరణిలో ఎటువంటి మార్పూ కనిపించడం లేదన్నారు. డిజిటల్‌ మార్పు అనేది ఏదో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది కాదు అని.. అది కొనసాగే ఒక ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో మైండ్‌ ట్రీ, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌లు మెగా విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని