సంక్షిప్తంగా

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా అనూజ్‌ పొద్దార్‌ పదోన్నతి పొందారు. ఛైర్మన్‌, ఎండీ పదవిని విడదీసిన కంపెనీ, ఇకపై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా శేఖర్‌ బజాజ్‌ పనిచేయన్నట్లు వెల్లడించింది.

Published : 17 Aug 2022 04:33 IST

* బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా అనూజ్‌ పొద్దార్‌ పదోన్నతి పొందారు. ఛైర్మన్‌, ఎండీ పదవిని విడదీసిన కంపెనీ, ఇకపై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా శేఖర్‌ బజాజ్‌ పనిచేయన్నట్లు వెల్లడించింది.

* ఆర్థిక సంస్థల నుంచి రూ.5,000 కోట్ల కాలావధి రుణాన్ని ఎన్‌టీపీసీ తీసుకోనుంది. టెండర్‌లో పాల్గొనడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆహ్వానించింది.

* మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో మొత్తం 27 శాతం వాటాను అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ మంగళవారం విక్రయించింది. దాదాపు 26.47 కోట్ల షేర్లను విక్రయించిన సంస్థ రూ.9000 కోట్ల వరకు సమీకరించింది.

* హిందుస్థాన్‌ జింక్‌లో ప్రభుత్వానికి ఉన్న 29.53 శాతం వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు అయిదు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను ఖరారు చేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎంపికైన వాటిలో ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా స్మార్ట్‌ పీఓఎస్‌ పరికరాలను ఏర్పాటు చేసేందుకు శామ్‌సంగ్‌ స్టోర్స్‌తో పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది.

* పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి సంస్థల మధ్య భాగస్వామ్యానికి కేంద్రం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ‘మంథన్‌’ను ఆవిష్కరించింది. దేశంలో టెక్నాలజీ ఆధారిత వినూత్నతలు, సొల్యూషన్‌లను అమలు చేయడానికి ఇది దోహదపడనుంది.

* కంపెనీ జారీ చేసిన మార్పిడి రహిత డిబెంచర్లకు చెల్లించాల్సిన అసలు, వడ్డీకి సంబంధించిన రూ.51.85 కోట్ల బకాయిల్ని చెల్లించడంలో విఫలమైనట్లు ఫ్యూచర్‌ కన్జూమర్‌ నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది. ఈ నెల 15న రూ.10.73 కోట్ల వడ్డీ, రూ.41.12 కోట్ల అసలు చెల్లించాల్సి ఉందని తెలిపింది.

* సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రెండో రోజున 92% స్పందన లభించింది. 2,85,63,816 షేర్లకు గాను 2,62,69,148 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ మదుపర్ల విభాగంలో 1.56 రెట్ల స్పందన లభించింది.

*  హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో 5.58% వాటాను ప్రమోటర్‌ బీఆర్‌డీఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ రూ.2,300 కోట్లకు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా క్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని