5జీ స్పెక్ట్రమ్‌ ముందస్తు చెల్లింపులు రూ.17,876 కోట్లు

భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌లు టెలికాం విభాగానికి (డాట్‌)   రూ.17,876 కోట్ల ముందస్తు చెల్లింపులు చేశాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొన్న ఈ సంస్థలు రూ.1.5 లక్షల

Published : 18 Aug 2022 05:22 IST

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌లు టెలికాం విభాగానికి (డాట్‌)   రూ.17,876 కోట్ల ముందస్తు చెల్లింపులు చేశాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొన్న ఈ సంస్థలు రూ.1.5 లక్షల కోట్లకు పైగా  విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 20 వార్షిక వాయిదాల్లో చెల్లింపులు చేసేందుకు టెలికాం సంస్థలకు వీలుంది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం 4 వార్షిక వాయిదాల మొత్తం రూ.8,312.4 కోట్లను ముందే చెల్లించింది. మిగిలిన సంస్థలు ముందస్తు చెల్లింపులు మాత్రమే జరిపాయి. రిలయన్స్‌ జియో     రూ.7,864.78 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా   రూ.1,679.98 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ.18.94 కోట్లు చెల్లించడంతో.. మొత్తంమీద టెలికాం విభాగానికి రూ.17,876 కోట్లు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని