బైట్‌ఎక్సెల్‌కు రూ.8 కోట్ల మూలధన నిధులు

ఐటీ రంగంలో ఎదగాలనుకునే వారికి నైపుణ్యాలు అందించే సంస్థ అయిన బైట్‌ఎక్సెల్‌, కొంతమంది ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8 కోట్ల) మూలధన నిధులు సమీకరించింది.

Published : 18 Aug 2022 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగంలో ఎదగాలనుకునే వారికి నైపుణ్యాలు అందించే సంస్థ అయిన బైట్‌ఎక్సెల్‌, కొంతమంది ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8 కోట్ల) మూలధన నిధులు సమీకరించింది. అమెరికాకు చెందిన జాయ్‌ ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, డెరెక్‌ మిసిమో, మరో ఆరుగురు ఈ నిధులు అందించారు. దీనివల్ల తమ వ్యాపార కార్యకలాపాలను తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరిస్తామని బైట్‌ఎక్సెల్‌ సీఈఓ కరుణ్‌ తాడేపల్లి తెలిపారు. ఇందుకోసం అదనంగా సిబ్బందిని నియమిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి 350 మంది ఉద్యోగులు తమ సంస్థలో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని