చెల్లింపుల వ్యవస్థల్లో ఫీజులపై స్పందించండి

చెల్లింపుల వ్యవస్థల్లో జరిపే లావాదేవీలపై అమలు చేస్తున్న ఫీజులు, ఛార్జీల విషయంలో స్పందించాలంటూ ప్రజలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కోరుతోంది.

Published : 18 Aug 2022 05:22 IST

ప్రజలకు ఆర్‌బీఐ విజ్ఞప్తి

ముంబయి: చెల్లింపుల వ్యవస్థల్లో జరిపే లావాదేవీలపై అమలు చేస్తున్న ఫీజులు, ఛార్జీల విషయంలో స్పందించాలంటూ ప్రజలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కోరుతోంది. ఈ లావాదేవీలపై ఛార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు; వీటిలో పాల్గొనే కంపెనీలకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంచే లక్ష్యంతో ఈ అడుగు వేసింది. ఐఎమ్‌పీఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, యూపీఐ వంటి వాటితో పాటు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(పీపీఐలు) పద్ధతులను చెల్లింపులకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఛార్జెస్‌ ఇన్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌’ పేరుతో చర్చాపత్రాన్ని ఆర్‌బీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబరు 30లోగా ఈ అంశంపై  ప్రజల నుంచి సమాధానాలను కోరుతోంది. ఈ చెల్లింపుల లావాదేవీ వ్యవస్థల్లో పలు ఇంటర్మీడియటరీలు కూడా ఉండడంతో, ఛార్జీలు అధికంగా ఉంటున్నాయని, పారదర్శకంగా లేవని వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ఆర్‌బీఐ అభిప్రాయ సేకరణకు దిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని