అదానీ గ్రూప్‌ ఇంధన ప్రాజెక్టులకు శ్రీలంకలో ప్రాథమిక అనుమతులు

అదానీ గ్రీన్‌ ఎనర్జీ శ్రీలంకలో ఏర్పాటు చేయనున్న 286 మెగావాట్‌, 234 మెగావాట్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినట్లు శ్రీలంక ఇంధన, విద్యుత్‌ శాఖ మంత్రి విజిశేఖర బుధవారం వెల్లడించారు.

Published : 18 Aug 2022 05:22 IST

కొలంబో: అదానీ గ్రీన్‌ ఎనర్జీ శ్రీలంకలో ఏర్పాటు చేయనున్న 286 మెగావాట్‌, 234 మెగావాట్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినట్లు శ్రీలంక ఇంధన, విద్యుత్‌ శాఖ మంత్రి విజిశేఖర బుధవారం వెల్లడించారు. 500 మి.డాలర్ల (సుమారు రూ.4,000 కోట్లు) పెట్టుబడితో ఉత్తర ప్రావిన్స్‌లోని మన్నార్‌, పూనేరిన్‌లో అదానీ గ్రూప్‌ ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ రంగ సెలాన్‌ విద్యుత్‌ బోర్డు (సీఈబీ), సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులను కలిసి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై చర్చించినట్లు విజిశేఖర ట్వీట్‌ చేశారు. ఇటీవల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఇంధన రంగంలోకి, భారతీయ పునరుత్పాదక ఇంధన దిగ్గజం అదానీ గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులు పెడుతోందని తొలిసారిగా వచ్చిన అధికారిక ప్రకటన ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని