ప్యాకేజ్డ్‌ కమొడిటీల్లో ప్రధాన వస్తువుల వివరాలు ప్యాక్‌లపై ముద్రించాల్సిందే!

ప్యాకేజ్డ్‌ కమొడిటీల్లోని ప్రధాన వస్తువుల వివరాలను ప్యాక్‌లపై బ్రాండ్‌ పేరు/ప్రోడక్ట్‌ లోగోతో ముద్రించడం తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ప్రజల నుంచి కేంద్రం సలహాలు ఆహ్వానించింది. ఈ నెల 31లోపు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరింది.

Published : 18 Aug 2022 05:22 IST

31లోపు స్పందించాలని ప్రజలను కోరిన కేంద్రం  

దిల్లీ: ప్యాకేజ్డ్‌ కమొడిటీల్లోని ప్రధాన వస్తువుల వివరాలను ప్యాక్‌లపై బ్రాండ్‌ పేరు/ప్రోడక్ట్‌ లోగోతో ముద్రించడం తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ప్రజల నుంచి కేంద్రం సలహాలు ఆహ్వానించింది. ఈ నెల 31లోపు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరింది. లీగల్‌ మెట్రాలజీ (ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌) రూల్స్‌, 2011లో ప్యాకేజ్డ్‌ కమొడిటీలోని ప్రధాన వస్తువుల కాంపోజిషన్‌ వివరాలు ముద్రించేలా ఒక నిబంధన చేర్చామని ఆహార, వినియోగదార్ల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ నిబంధన మెకానికల్‌ లేదా ఎలక్ట్రిక్‌ కమొడిటీలకు వర్తించదని పేర్కొంది. చాలా మంది తయారీదార్లు/ప్యాకర్లు/దిగుమతిదార్లు ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌లోని ప్రధాన కాంపోజిషన్‌ వివరాలు ప్యాక్‌పై ముద్రించడం లేదని గుర్తించిన మంత్రిత్వ శాఖ, ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రజలతో పాటు పరిశ్రమలు, అసోసియేషన్లు, వినియోగదార్లు, స్వచ్ఛంద వినియోగదారు సంస్థలు కూడా  తమ సలహాలు, సూచనలు పంపాల్సిందిగా మంత్రిత్వ శాఖ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని