టెలికాం కనెక్షన్లు 117.29 కోట్లు

దేశంలో టెలికాం కనెక్షన్ల సంఖ్య జూన్‌లో కాస్త పెరిగి, 117.29 కోట్లకు చేరుకుందని ట్రాయ్‌ తెలిపింది. మేలో ఈ సంఖ్య 117.07 కోట్లుగా ఉంది. వైర్‌లెస్‌ వినియోగదార్ల సంఖ్య 114.55 కోట్ల నుంచి 114.73 కోట్లకు చేరుకుంది.

Published : 18 Aug 2022 05:22 IST

జియోదే అగ్రస్థానం

దిల్లీ: దేశంలో టెలికాం కనెక్షన్ల సంఖ్య జూన్‌లో కాస్త పెరిగి, 117.29 కోట్లకు చేరుకుందని ట్రాయ్‌ తెలిపింది. మేలో ఈ సంఖ్య 117.07 కోట్లుగా ఉంది. వైర్‌లెస్‌ వినియోగదార్ల సంఖ్య 114.55 కోట్ల నుంచి 114.73 కోట్లకు చేరుకుంది. జూన్‌లో జియో అత్యధికంగా 42.23 లక్షల మందిని జత చేర్చుకోవడంతో, మొత్తం కనెక్షన్ల సంఖ్య 41.3 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌ నికరంగా 7.93 లక్షలు జతచేయడంతో, కనెక్షన్లు 36.29 కోట్లకు పెరిగాయి. వొడాఫోన్‌ ఐడియా కనెక్షన్లు 18 లక్షలు తగ్గి 25.66 కోట్లకు పరిమితమైంది. వైర్‌లైన్‌లోనూ జియో అధికంగా 2.4 లక్షల మందిని చేర్చుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 32,038 మందిని పోగొట్టుకుంది. బ్రాండ్‌బ్యాండ్‌ విషయంలోనూ జియో(41.91 కోట్ల కనెక్షన్లు) ముందుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ (21.94 కోట్లు), వొడాఫోన్‌ ఐడియా(12.29 కోట్లు), బీఎస్‌ఎన్‌ఎల్‌(2.5 కోట్లు), అత్రియా కన్వర్జెన్స్‌(21.1 లక్షలు) ఉన్నాయి. ఈ అయిదు కంపెనీలే 98.47 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని