విదేశీ పెట్టుబడులకు సెబీ కొత్త మార్గదర్శకాలు

ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌లు), వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు (వీసీఎఫ్‌లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై విదేశీ పెట్టుబడి సంస్థలకు భారత్‌తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

Published : 19 Aug 2022 03:06 IST

ముంబయి: ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌లు), వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు (వీసీఎఫ్‌లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై విదేశీ పెట్టుబడి సంస్థలకు భారత్‌తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది.  కొత్త నిబంధనల ప్రకారం.. భారత్‌ వెలుపల నమోదుకాని కంపెనీల షేర్లలో కూడా ఏఐఎఫ్‌లు పెట్టుబడులు పెట్టొచ్చు. ఆఫ్‌షోర్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల్లో పెట్టుబడులకు వీసీఎఫ్‌లను అనుమతిస్తారు. అయితే భారత్‌తో సంబంధం ఉన్న కంపెనీల్లోనే ఇటువంటి పెట్టుబడులకు అనుమతి ఉంటుందన్న నిబంధన పెట్టారు. ప్రధాన కార్యాలయం విదేశాల్లో ఉన్నా, భారత్‌లో కార్యకలాపాలు ఉంటే సరిపోతుంది.

* సైర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ముగిసేసరికి మొత్తం 32.61 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,85,63,816 షేర్లు జారీ చేయనుండగా, 93,14,84,536 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 87.56 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 17.50 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 5.53 రెట్ల స్పందన వచ్చింది.  
24 నుంచి డ్రీమ్‌ఫోక్స్‌ ఐపీఓ: ఎయిర్‌పోర్ట్‌ సేవల అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌ ఐపీఓ ఆగస్టు 24న ప్రారంభమై 26న ముగియనుంది. యాంకర్‌ మదుపర్లకు బిడ్డింగ్‌ 23న ప్రారంభమవుతుంది. పూర్తి ఆఫర్‌ ఫర్‌ సేల్‌గా రానున్న ఈ ఐపీఓలో 1.72 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
* బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా వాహన విడిభాగాల సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూలో 13.6 శాతం వాటాకు సమానమైన 7.94 కోట్ల షేర్లను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌ రూ.4044 కోట్లకు గురువారం విక్రయించింది. ఈ షేర్లను సింగపూర్‌ ప్రభుత్వం, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌తో పాటు ఇతరులు కొనుగోలు చేశారు.  
ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ రూ. 65 డివిడెండ్‌
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ సంస్థ ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ షేరుజోరు కొనసాగింది. గురువారం 10 శాతం దూసుకెళ్లిన షేరు రూ.758.50 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకి, అక్కడే ముగిసింది. గత 5 రోజుల్లో షేరు 53 శాతానికి పైగా రాణించింది. కంపెనీ ప్రకటించిన రూ.65 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌కు ఈనెల 25ను రికార్డు తేదీగా నిర్ణయించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని