హైదరాబాద్‌ సహా ఏడు నగరాల్లో కార్యాలయ లీజు రెట్టింపు

కార్యాలయాల లీజు జులైలో రెట్టింపునకు మించి పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా 7 నగరాల్లో కార్యాలయాల లీజింగ్‌ గత నెలలో 8.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరినట్లు ‘నెలవారీ కార్యాలయ లీజు ట్రాకర్‌’లో వెల్లడించింది.

Published : 19 Aug 2022 03:06 IST

జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక

దిల్లీ: కార్యాలయాల లీజు జులైలో రెట్టింపునకు మించి పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా 7 నగరాల్లో కార్యాలయాల లీజింగ్‌ గత నెలలో 8.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరినట్లు ‘నెలవారీ కార్యాలయ లీజు ట్రాకర్‌’లో వెల్లడించింది. 2021 జులైలో ఇది 3.9 మిలియన్‌ చ.అ. మేరే ఉంది. ఈ ఏడాది జూన్‌ నాటి 5.8 మిలియన్‌ చ.అ. కంటే కూడా జులైలో అధికమే. హైదరాబాద్‌, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాలలోని అన్ని రకాల కార్యాలయ భవనాల్లోని లీజు లావాదేవీల ఆధారంగా నివేదికను రూపొందించారు. జులై లావాదేవీల్లో 85 శాతం వాటా బెంగళూరు, ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌లదే. ఐటీ కంపెనీలే లీజింగ్‌లో  కీలకంగా ఉన్నాయి. ఇవే 53 శాతం వాటా సొంతం చేసుకున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం వాటా 18 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని