7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ‘గేమర్‌ షార్ట్స్‌’ యాప్‌

గేమింగ్‌ రంగంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌, ‘గేమర్‌ షార్ట్స్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా దీన్ని రూపొందించిన ఘనత తమకు దక్కుతుందని

Published : 19 Aug 2022 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: గేమింగ్‌ రంగంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌, ‘గేమర్‌ షార్ట్స్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా దీన్ని రూపొందించిన ఘనత తమకు దక్కుతుందని 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ ఎల్‌. మారుతీ శంకర్‌ వెల్లడించారు. ఈ యాప్‌ను 25 షార్ట్‌ గేమ్స్‌తో తీసుకు వచ్చామని, మున్ముందు గేమ్స్‌ సంఖ్యను పెంచుతామని తెలిపారు. రేసింగ్‌, పజిల్స్‌, ఆర్కేడ్‌ స్పోర్ట్స్‌.., ఇంకా అనేక విభాగాల గేమ్స్‌ ఇందులో ఉన్నాయి. తక్కువ సమయం పట్టే సరదా ఆటలను ‘గేమర్‌ షార్ట్స్‌’ గా పరిగణిస్తున్నారు. ఈ యాప్‌ను ‘ప్లేస్టోర్‌’ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మలిదశలో దీన్ని యాపిల్‌ ఫోన్‌ వినియోగదార్లకు కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ‘మార్కెట్‌ రీసెర్చ్‌ ఫ్యూచర్‌’ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 220 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న గేమింగ్‌ మార్కెట్‌ 2030 నాటికి 547 బిలియన్‌ డాలర్లకు విస్తరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు