సరికొత్త ఆల్టో కె10

మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సరికొత్తగా తీర్చిదిద్దిన ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌ను గురువారం విడుదల చేసింది.

Updated : 19 Aug 2022 13:08 IST

ప్రారంభ ధర రూ.3,99,000

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సరికొత్తగా తీర్చిదిద్దిన ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌ను గురువారం విడుదల చేసింది. ఈ కారు రూ.3.99-5.83 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ) శ్రేణిలో లభించనుంది. ఈ నెల 10 నుంచే  ఎరీనా విక్రయ కేంద్రాల్లో ఈ కార్లకు బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. ఆల్టో కె10, ఆల్టో 800, ఎస్‌-ప్రెసోలతో కూడిన ప్రారంభ స్థాయి హ్యాచ్‌బ్యాక్‌ విభాగాన్ని మరిన్ని ఉత్పత్తులతో ఆకర్షణీయంగా మార్చాలనుకుంటున్నట్లు సంస్థ ఎండీ, సీఈఓ హిసాషి టకుచి వెల్లడించారు.
ఆల్టో బ్రాండ్‌ 2020 వరకు 16 ఏళ్లపాటు అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రారంభ స్థాయి కారుగా పేరు గాంచింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ అత్యధికంగా అమ్ముడుపోయిన నాలుగో మోడల్‌గా నిలిచింది. చాలా వాహన సంస్థలు ప్రారంభ స్థాయి ప్రయాణికుల కార్ల విభాగాన్ని స్పోర్ట్‌ వినియోగ వాహనా (ఎస్‌యూవీ)లతో భర్తీ చేస్తున్న సమయంలో, మారుతీ కొత్త ఆల్టో కె10ను విడుదల చేయడం విశేషం. మారుతీతో పాటు ప్రారంభ స్థాయి కార్ల విభాగంలో రెనో ఇండియా ఒక్కటే ఉంది. అక్టోబరు 1 నుంచి తయారయ్యే ప్రతి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తున్న తరుణంలోనూ, కొత్త ఆల్టో కె10ను 2 ఎయిర్‌బ్యాగ్‌లతో ఎంఎస్‌ఐ తీసుకురావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని