పసిడి బాండ్ల ఇష్యూ ధర రూ.5,197

సార్వభౌమ పసిడి బాండ్‌ పథకం 2022-23 తదుపరి దశ ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిరీస్‌-2 కింద సోమవారం (ఈనెల 22) నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Published : 20 Aug 2022 02:37 IST

సోమవారం నుంచి మొదలు

ముంబయి: సార్వభౌమ పసిడి బాండ్‌ పథకం 2022-23 తదుపరి దశ ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిరీస్‌-2 కింద సోమవారం (ఈనెల 22) నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే మదుపర్లకు సాధారణ ధరపై గ్రాముకు రూ.50 రాయితీ ఇస్తారు. దీంతో వీరికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,147 అవుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. కేంద్రం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ఈ బాండ్లను అమ్ముతారు. కనీసం 1 గ్రాము.. గరిష్ఠంగా 4 కిలోల వరకు వ్యక్తులు కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని