ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో భద్రతా లోపాలు

ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్‌ దిగ్గజం యాపిల్‌ హెచ్చరించింది. సైబర్‌ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ

Published : 20 Aug 2022 02:37 IST

హెచ్చరించిన యాపిల్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్‌ దిగ్గజం యాపిల్‌ హెచ్చరించింది. సైబర్‌ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. భద్రతా లోపాలపై రెండు నివేదికలను యాపిల్‌ విడుదల చేసింది. భద్రతా ముప్పు ఉన్న ఐఫోన్‌ 6ఎస్‌, ఆ తర్వాతి మోడళ్లు, అయిదో తరం ఐప్యాడ్‌, ఆ తర్వాతి మోడళ్లు, అన్ని ఐప్యాడ్‌ ప్రో మోడళ్లు, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2, మ్యాక్‌ఓఎస్‌ మాంటెరీపై నడుస్తున్న మ్యాక్‌ కంప్యూటర్‌లను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందిగా వినియోగదార్లకు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌ వివరణ ప్రకారం.. ఈ పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు చేపట్టే ప్రమాదం ఉందని, వారికి నచ్చినట్లు వినియోగించుకోవచ్చని సోషల్‌ప్రూఫ్‌ సెక్యూరిటీ సీఈఓ రాచెల్‌ టొబాక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని