విదేశాల్లో చెల్లించిన పన్ను క్లెయింకు గడువు పెంపు

విదేశాల్లో చెల్లించిన పన్నుకు సంబంధించి క్లెయిం చేసుకునేందుకు అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసే వరకు గడువు ఇస్తున్నట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువు లోపు ఐటీ రిటర్నులు దాఖలు చేసిన సందర్భంలోనే

Published : 20 Aug 2022 02:37 IST

దిల్లీ: విదేశాల్లో చెల్లించిన పన్నుకు సంబంధించి క్లెయిం చేసుకునేందుకు అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసే వరకు గడువు ఇస్తున్నట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువు లోపు ఐటీ రిటర్నులు దాఖలు చేసిన సందర్భంలోనే ఈ వెసులుబాటు ఉంటుందని శుక్రవారం వెల్లడించింది. ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఎఫ్‌టీసీ) క్లెయిం చేసుకున్న సందర్భంలో ఫారం-67తో పాటు, అవసరమైన అన్ని పత్రాలనూ అసలు రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే జత చేయాల్సి వచ్చేది. దీనివల్ల కొన్నిసార్లు ఎఫ్‌టీసీ క్లెయింలో ఇబ్బందులు తలెత్తేవి. దీన్ని సవరిస్తూ.. సంబంధిత మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌) ముగిసేలోపు ఫారం-67 సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన అన్ని ఎఫ్‌టీసీ క్లెయింలకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని