ఆమోదయోగ్యం కాని స్థాయిలో ద్రవ్యోల్బణం

ఆమోదయోగ్యం కాని, అసౌకర్యవంత స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉందని, అందుకే 50 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచేందుకు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత్‌ దాస్‌ ప్రతిపాదించారని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ముఖ్యాంశాల ఆధారంగా తెలుస్తోంది.

Published : 20 Aug 2022 02:37 IST

ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నరు

ముంబయి: ఆమోదయోగ్యం కాని, అసౌకర్యవంత స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉందని, అందుకే 50 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచేందుకు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత్‌ దాస్‌ ప్రతిపాదించారని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ముఖ్యాంశాల ఆధారంగా తెలుస్తోంది. ఎంపీసీలోని ఇతర సభ్యులు కూడా ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు అవి పేర్కొన్నాయి. ఆగస్టు 3 నుంచి 5 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.  ఈ విధాన నిర్ణయాలు పరపతి విధాన విశ్వసనీయత బలోపేతం అయ్యేందుకు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకు దోహదపడతాయని భావిస్తున్నామని దాస్‌ అభిప్రాయపడినట్లు ముఖ్యాంశాలు వెల్లడించాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా క్రమపద్ధతిలో మదింపు చేసుకుంటూ తమ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. వృద్ధి పుంజుకోవడం కొనసాగుతున్నందున, నిర్దిష్ట లక్ష్య పరిధిలోకి ద్రవ్యోల్బణాన్ని తీసుకొచ్చేలా విధానపరమైన చర్యలను చేపడుతున్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు మేఖేల్‌ దేవవ్రత పాత్రా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని