పేటెంట్‌ వివాదాన్ని పరిష్కరించుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌

ఒకాలివ (ఒబెటికోలిక్‌ యాసిడ్‌) జనరిక్‌ ఔషధానికి సంబంధించి ఇంటర్‌సెప్ట్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., తో పేటెంట్‌ వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిష్కరించుకుంది. ఈ ఔషధాన్ని ప్రైమరీ బైలరీ కొలాంజిటిస్‌ (పీబీసీ) అనే కాలేయ వ్యాధికి చికిత్సలో వినియోగిస్తున్నారు.

Published : 20 Aug 2022 02:37 IST

హైదరాబాద్‌: ఒకాలివ (ఒబెటికోలిక్‌ యాసిడ్‌) జనరిక్‌ ఔషధానికి సంబంధించి ఇంటర్‌సెప్ట్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., తో పేటెంట్‌ వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిష్కరించుకుంది. ఈ ఔషధాన్ని ప్రైమరీ బైలరీ కొలాంజిటిస్‌ (పీబీసీ) అనే కాలేయ వ్యాధికి చికిత్సలో వినియోగిస్తున్నారు. ఇంటర్‌సెప్ట్‌ ఫార్మాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌, 2035 అక్టోబరు 26 నుంచి యూఎస్‌ మార్కెట్లో విక్రయించవచ్చు. ఒకాలివ ఔషధం గత ఏడాదిలో 363 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇప్పటికే మనదేశంలో విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు