అశోక్‌ లేలాండ్‌ కొత్త టిప్పర్‌

నిర్మాణ, గనుల రంగాల కంపెనీల కోసం ఏవీటీఆర్‌ 4825 టిప్పర్‌ను అశోక్‌ లేలాండ్‌ తీసుకొచ్చింది. ఇందులో అమర్చిన హెచ్‌6 ఇంజిన్‌ అధిక సామర్థ్యాన్ని ఇస్తుందని సంస్థ తెలిపింది. కంపెనీ మొదటి మాడ్యులర్‌ ట్రక్కు ప్లాట్‌ఫామ్‌ అయిన ఏవీటీఆర్‌, 19-55 టన్నుల స్థూల వాహన బరువు (జీవీడబ్ల్యూ)ను అందిస్తుంది.

Published : 20 Aug 2022 02:37 IST

చెన్నై: నిర్మాణ, గనుల రంగాల కంపెనీల కోసం ఏవీటీఆర్‌ 4825 టిప్పర్‌ను అశోక్‌ లేలాండ్‌ తీసుకొచ్చింది. ఇందులో అమర్చిన హెచ్‌6 ఇంజిన్‌ అధిక సామర్థ్యాన్ని ఇస్తుందని సంస్థ తెలిపింది. కంపెనీ మొదటి మాడ్యులర్‌ ట్రక్కు ప్లాట్‌ఫామ్‌ అయిన ఏవీటీఆర్‌, 19-55 టన్నుల స్థూల వాహన బరువు (జీవీడబ్ల్యూ)ను అందిస్తుంది. ఇందులో 250 హెచ్‌పీ హెచ్‌-సిరీస్‌ 4వీ 6-సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. కంపెనీ ఐ-జెన్‌6 టెక్నాలజీతో ఇంజిన్‌ మెరుగ్గా ఉంటుందని తెలిపింది. నిర్మాణ, గనుల అవసరాలకు ఏవీటీఆర్‌ 4825 సరిగ్గా సరిపోతుందని కంపెనీ మధ్య, భారీ వాణిజ్య వాహనాల విభాగాధిపతి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని