పసిడి దిగుమతులు పెరిగాయ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులైలో దేశంలోకి పసిడి దిగుమతులు 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గిరాకీ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కిందటేడాది ఇదే కాలంలో దిగుమతులు 12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Published : 20 Aug 2022 02:37 IST

ఏప్రిల్‌-జులైలో 13 బి. డాలర్లకు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులైలో దేశంలోకి పసిడి దిగుమతులు 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గిరాకీ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కిందటేడాది ఇదే కాలంలో దిగుమతులు 12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 జులైలో మాత్రం పసిడి దిగుమతులు 43.6 శాతం తగ్గి 2.4 బిలియన్‌ డాలర్లకే పరిమితం అయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పసిడి, చమురు దిగదుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 30 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. 2021 ఏప్రిల్‌-జులైలో వాణిజ్య లోటు 10.63 బిలియన్‌ డాలర్లు మాత్రమే. చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద పసిడి వినియోగదారు భారతే. ఏప్రిల్‌-జులైలో రత్నాభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి 13.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు