అకౌంట్‌ అగ్రిగేటర్‌ నియమావళిలోకి సెబీ

అకౌంట్‌ అగ్రిగేటర్‌ నియమావళిలోకి చేరినట్లు సెబీ శుక్రవారం వెల్లడించింది. ఆర్‌బీఐ నియంత్రిత ఆర్థిక డేటా పంపిణీ వ్యవస్థకు ఇది తోడ్పాటు ఇవ్వనుంది. ఆర్థిక సేవలు అందించే సంస్థలతో మ్యూచువల్‌ ఫండ్‌, షేర్ల పెట్టుబడుల వివరాలను మదుపర్లు పంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.

Published : 20 Aug 2022 02:37 IST

దిల్లీ: అకౌంట్‌ అగ్రిగేటర్‌ నియమావళిలోకి చేరినట్లు సెబీ శుక్రవారం వెల్లడించింది. ఆర్‌బీఐ నియంత్రిత ఆర్థిక డేటా పంపిణీ వ్యవస్థకు ఇది తోడ్పాటు ఇవ్వనుంది. ఆర్థిక సేవలు అందించే సంస్థలతో మ్యూచువల్‌ ఫండ్‌, షేర్ల పెట్టుబడుల వివరాలను మదుపర్లు పంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఈ నియామవళి కింద సెక్యూరిటీల మార్కెట్‌లో డిపాజిటరీలు, ఏఎంసీలు వంటి ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ప్రొవైడర్లు (ఎఫ్‌ఐపీలు) తమ రిజిస్ట్రార్‌, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ లేదా ఆర్‌టీఏల ద్వారా వినియోగదార్లకు మార్కెట్లకు సంబంధించిన ఆర్థిక సమాచారం అందించొచ్చు. ఆర్‌బీఐతో నమోదైన అకౌంట్‌ అగ్రిగేటర్ల ద్వారా ఇది సాధ్యపడుతుంది. మొత్తం ట్రేడింగ్‌ వ్యవస్థ, డిపాజిటరీ వ్యవస్థ, మ్యూచువల్‌ ఫండ్‌ వ్యవస్థలు ఒకే తాటిపైకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని