డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్ల లావాదేవీలకు బ్లాక్‌ చేయడం తప్పనిసరి

షేర్ల లావాదేవీలకు డీమ్యాట్‌ ఖాతాల్లో మదుపర్లు సెక్యూరిటీలను బ్లాక్‌ చేయడం తప్పనిసరని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం ప్రకటించింది. నవంబరు 14 నుంచి ఇది తప్పనిసరని సెబీ సర్క్యూలర్‌లో పేర్కొంది.

Published : 20 Aug 2022 02:37 IST

నవంబరు 14 నుంచి అమలు

దిల్లీ: షేర్ల లావాదేవీలకు డీమ్యాట్‌ ఖాతాల్లో మదుపర్లు సెక్యూరిటీలను బ్లాక్‌ చేయడం తప్పనిసరని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం ప్రకటించింది. నవంబరు 14 నుంచి ఇది తప్పనిసరని సెబీ సర్క్యూలర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సదుపాయం మదుపర్లకు ఐచ్ఛికంగా ఉంది. ఈ విధానంలో మదుపరి విక్రయించాలనుకుంటున్న షేర్లను వారి డీమ్యాట్‌ ఖాతాలో క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు అనుకూలంగా బ్లాక్‌ చేస్తారు. ఆగస్టు 1 నుంచి సెక్యూరిటీలను బ్లాక్‌ చేసుకునే సౌలభ్యాన్ని డీమ్యాట్‌ ఖాతాల్లో కల్పించింది. ఎర్లీ పే-ఇన్‌ పద్ధతి కూడా అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం.. ఖాతాదారు డీమ్యాట్‌ ఖాతా నుంచి క్లియరింగ్‌ కార్పొరేషన్‌ సంబంధిత ఖాతాకు షేర్లను బదిలీ చేస్తారు. లావాదేవీ పూర్తికాకుంటే షేర్లు మళ్లీ మదుపరి ఖాతాకు వచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని