బ్యాంకుల ప్రైవేటీకరణ మంచి ఫలితాలనిస్తుంది

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరిశోధకులు తాజాగా వెలువరచిన ఒక వ్యాసంపై ఆర్‌బీఐ  స్పష్టతనిచ్చింది. ‘ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌: యాన్‌ ఆల్టర్నేటివ్‌ పర్‌స్పెక్టివ్‌’ అనే వ్యాసంలోని అభిప్రాయాలు వ్యాసకర్తలకు చెందినవే మినహా, ఆర్‌బీఐ చెప్పినట్లుగా భావించరాదని తెలిపింది.

Published : 20 Aug 2022 02:37 IST

ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరగాలి
పరిశోధకుల వ్యాసంపై ఆర్‌బీఐ స్పష్టీకరణ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరిశోధకులు తాజాగా వెలువరచిన ఒక వ్యాసంపై ఆర్‌బీఐ  స్పష్టతనిచ్చింది. ‘ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌: యాన్‌ ఆల్టర్నేటివ్‌ పర్‌స్పెక్టివ్‌’ అనే వ్యాసంలోని అభిప్రాయాలు వ్యాసకర్తలకు చెందినవే మినహా, ఆర్‌బీఐ చెప్పినట్లుగా భావించరాదని తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న విధానం వల్ల, మెరుగైన ఫలితాలను వస్తాయన్నదే ఆ వ్యాసకర్తల భావన అని స్పష్టం చేసింది. ఆర్‌బీఐకి చెందిన కొంత మంది పరిశోధకులు ఆ వ్యాసాన్ని రాశారు. పీఎస్‌బీలను ఒక్కసారిగా ప్రైవేటీకరించడం కంటే(బిగ్‌ బ్యాంగ్‌ అప్రోచ్‌) క్రమంగా పైవేటీకరణ చేస్తూ వెళ్లడం మంచిదని ఆ వ్యాసం పేర్కొంది. ‘ఒత్తిడి సమయాల్లో బలమైన పీఎస్‌బీలు అంటూ లేకుంటే.. బ్యాంకింగ్‌ రంగంపై అస్థిరత్వ ప్రభావం కనిపిస్తుంది. అది ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తుంద’ని పేర్కొంది. ‘బిగ్‌ బ్యాంగ్‌ విధానం కంటే ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఒక క్రమ పద్ధతిలో వెళ్లడం వల్లే మంచి ఫలితాలు వస్తాయన్న’దే వ్యాసకర్తల అభిప్రాయమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరహా విధానం వల్ల భారీ స్థాయి ప్రైవేటీకరణ జరగకుండా ఆర్థిక సంఘటితం వంటి సామాజిక లక్ష్యాలను చేరడం సాధ్యమవుతుందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని