దేశీయ విపణిలోకి మెక్‌లారెన్‌!

బ్రిటన్‌ విలాసకార్ల దిగ్గజం మెక్‌లారెన్‌ ఈ ఏడాది చివర్లో భారత విపణిలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. మొదటి విక్రయశాలను ముంబయిలో వచ్చే అక్టోబరులో ప్రారంభిస్తామని తెలిపింది. కంపెనీ విక్రయాలు చేపట్టనున్న 41వ విపణిగా

Published : 23 Aug 2022 02:08 IST

దిల్లీ: బ్రిటన్‌ విలాసకార్ల దిగ్గజం మెక్‌లారెన్‌ ఈ ఏడాది చివర్లో భారత విపణిలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. మొదటి విక్రయశాలను ముంబయిలో వచ్చే అక్టోబరులో ప్రారంభిస్తామని తెలిపింది. కంపెనీ విక్రయాలు చేపట్టనున్న 41వ విపణిగా భారత్‌ నిలవనుంది. అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో విక్రయశాలను ప్రారంభిస్తున్నామని, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇప్పటికే గుర్తింపు పొందిన బ్రాండ్‌ను మరింత విస్తరించనున్నట్లు మెక్‌లారెన్‌ తెలిపింది. బ్రిటన్‌ తయారీ కేంద్రంలో తయారు చేసిన సూపర్‌ కార్లను మెక్‌లారెన్‌ భారత్‌లో విక్రయించనుంది. ‘భారత్‌ మాకు కీలకమైన విపణి. ముంబయి విక్రయశాల ద్వారా మా అభిమానులు, ఖాతాదారులు కావాల్సిన ఉత్పత్తులను పొందొచ్చు. కంపెనీ హైబ్రిడ్‌ సూపర్‌ కార్‌ ఆర్టురాను భారత్‌కు తీసుకురానున్నాం’ అని మెక్‌లారెన్‌ ఆటోమోటివ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (అపాక్‌, చైనా) పాల్‌ హ్యారిస్‌ తెలిపారు. మెక్‌లారెన్‌ మోడళ్ల విక్రయాలు, విక్రయానంతర సేవలు, సర్వీసింగ్‌ వంటి సేవలను ముంబయి విక్రయశాలలో పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని