ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణమూర్తి సుబ్రమణియన్‌

కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌, మనదేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Published : 26 Aug 2022 01:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌, మనదేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల సంఘం ఈ నియామకాన్ని ఖరారు చేసింది. ఈ ఏడాది నవంబరు 1 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం మనదేశం నుంచి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ సుర్జీత్‌ ఎస్‌.భల్లా వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆచార్యులుగా సుబ్రమణియన్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని