భారత్‌లో కొలువుల పండగే

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో భారత్‌లో నియామకాలు అధికంగా జరిగే అవకాశం ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూపు సర్వే తెలిపింది. నియామకాలు జరిపేందుకు 54 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగావకాశాల ధోరణులపై 41 దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన 40,600 సంస్థల నుంచి

Published : 14 Sep 2022 02:23 IST

నియామకాలు జరిపేందుకు 54% కంపెనీల ప్రణాళిక

అక్టోబరు- డిసెంబరుపై మ్యాన్‌పవర్‌ గ్రూపు సర్వే

దిల్లీ: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో భారత్‌లో నియామకాలు అధికంగా జరిగే అవకాశం ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూపు సర్వే తెలిపింది. నియామకాలు జరిపేందుకు 54 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగావకాశాల ధోరణులపై 41 దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన 40,600 సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఆ వివరాలు ఇలా.

* భారత్‌లో తమ సిబ్బంది సంఖ్యను పెంచుకుంటామని 64 శాతం సంస్థలు వెల్లడించాయి. 10 శాతం సంస్థలు నియామక ఆసక్తి తగ్గుతుందని చెప్పగా.. 24 శాతం కంపెనీలు ఎటువంటి మార్పు రాదని తెలిపాయి. దీంతో నికరంగా 54 శాతం కంపెనీలు నియామకాల పెంపుపై ఆసక్తి చూపుతున్నట్లయ్యింది. 56 శాతంతో బ్రెజిల్‌ మొదటి స్థానంలో ఉంది.

* దేశీయంగా 2021 అక్టోబరు- డిసెంబరుతో పోలిస్తే 10 శాతం, ఈ ఏడాది జులై- సెప్టెంబరుతో పోలిస్తే 4 శాతం నియామకాలు పెరగొచ్చు. అయితే తమకు అవసరమైన నిపుణులు దొరకడం కష్టంగా మారిందని 85 శాతం సంస్థలు వెల్లడిస్తున్నాయి. దేశ దక్షిణ, ఉత్తరాది ప్రాంతాల్లో 56 శాతం కంపెనీలు, పశ్చిమ ప్రాంతంలో 53%, తూర్పు ప్రాంతంలో 47 శాతం కంపెనీలు నియామకాలకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

* 11 పరిశ్రమ రంగాల్లోనూ నియామకాలు అధికంగా ఉండొచ్చు. 63 శాతంతో ఐటీ, టెక్నాలజీ రంగాలు అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా, స్థిరాస్తి (61%) రంగాలు న్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని