కార్పొరేట్‌ రుణాల పరిధిలోకి వస్తే ఇరు పక్షాలపైనా దివాలా చర్యలు: సుప్రీంకోర్టు

కార్పొరేట్‌ రుణాల పరిధిలోకి వచ్చే రెండు కార్పొరేట్‌ సంస్థలు వస్తే.. దివాలా స్మతి (ఐబీసీ) కింద పరిష్కార చర్యలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు గురువారం పేర్కొంది. ఐబీసీలోని సెక్షన్‌ 7 ప్రకారం ఆర్థిక రుణదాతలు దివాలా పరిష్కార ప్రక్రియ కోరవచ్చు. ఒక రుణగ్రహీత కోసం చేసే తీర్మానం..

Published : 23 Sep 2022 02:36 IST

దిల్లీ: కార్పొరేట్‌ రుణాల పరిధిలోకి వచ్చే రెండు కార్పొరేట్‌ సంస్థలు వస్తే.. దివాలా స్మతి (ఐబీసీ) కింద పరిష్కార చర్యలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు గురువారం పేర్కొంది. ఐబీసీలోని సెక్షన్‌ 7 ప్రకారం ఆర్థిక రుణదాతలు దివాలా పరిష్కార ప్రక్రియ కోరవచ్చు. ఒక రుణగ్రహీత కోసం చేసే తీర్మానం.. సహ రుణగ్రహీతకు సైతం వర్తిస్తుందని సుప్రీం కోర్టు వెల్లడించింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ముంబయి అడ్‌జుడికేటింగ్‌ అధారిటీ తీర్పును జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేయడంపై గతేడాది ఆగస్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని