రుణ రికవరీకి థర్డ్‌ పార్టీ ఏజెంట్లు వద్దు!

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌) తమ రుణ రికవరీ కోసం థర్డ్‌ పార్టీ ఏజెంట్లను వినియోగించడాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ నిషేధం

Published : 23 Sep 2022 02:54 IST

ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఆర్‌బీఐ ఆదేశం

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌) తమ రుణ రికవరీ కోసం థర్డ్‌ పార్టీ ఏజెంట్లను వినియోగించడాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. ఝార్ఖండ్‌ హజారీభాగ్‌ జిల్లాలో గత వారం రికవరీ ఏజెంట్ల దూకుడు వల్ల గర్భిణీ ఒకరు ట్రాక్టర్‌ చక్రాల కింద పడి మృతి చెందిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా కొనసాగుతున్న ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తమ సొంత ఉద్యోగుల ద్వారానే రికవరీ కార్యకలాపాలు సాగించాలని కేంద్ర బ్యాంక్‌ ఆదేశించింది. మహిళ మృతి కేసులో మహీంద్రా ఫైనాన్స్‌ నియమించుకున్న టీమ్‌ లీజ్‌ ఉద్యోగి రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మృతిపై మహీంద్రా గ్రూప్‌ సీఈఓ, ఎండీ అనీశ్‌ షా సంతాపం తెలిపారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts