ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితాలో ఎకొలైట్‌ వ్యవస్థాపకుడు లీలాకుమార్‌

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్‌ డిజిటల్‌ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్‌ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితా- 2022’ లో తొలిసారిగా స్థానం సంపాదించారు.

Published : 23 Sep 2022 02:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్‌ డిజిటల్‌ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్‌ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితా- 2022’ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. రూ.3,600 కోట్ల సంపదతో ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి సారిగా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిలో’ రెండో స్థానంలో నిలిచారు. 2007లో ఏర్పాటైన ఎకొలైట్‌ డిజిటల్‌లో 3,000 మందికి పైగా ఐటీ నిపుణులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు మనదేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, గురుగ్రామ్‌, చెన్నైలలో ఈ సంస్థ కేంద్రాలున్నాయి. 2025 నాటికి 10,000 మంది సిబ్బందితో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయాలు ఆర్జించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఎకొలైట్‌ డిజిటల్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ- న్యూ మౌంటెన్‌ కేపిటల్‌ పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో తమ వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించనున్నట్లు లీలాకుమార్‌ ఇటీవల వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని