ఓయో విలువ రూ.21,600 కోట్లు!

సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూపు కార్పొరేషన్‌ తన పద్దు పుస్తకాల్లో ఓయో హోటల్స్‌ అంచనా విలువను 20 శాతానికి పైగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంతకుమునుపు ఓయో విలువ 3.4 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.27,200 కోట్లు) లెక్కించగా.. ఇప్పుడు దానిని 2.7 బిలియన్‌

Published : 23 Sep 2022 02:54 IST

ఇంతకుముందు అంచనా రూ.27,200 కోట్లు
కోత విధించిన సాఫ్ట్‌బ్యాంక్‌  

దిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూపు కార్పొరేషన్‌ తన పద్దు పుస్తకాల్లో ఓయో హోటల్స్‌ అంచనా విలువను 20 శాతానికి పైగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంతకుమునుపు ఓయో విలువ 3.4 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.27,200 కోట్లు) లెక్కించగా.. ఇప్పుడు దానిని 2.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,600 కోట్ల)కు పరిమితం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓయో తరహా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇతర కంపెనీల విలువను ఆధారంగా చేసుకుని, సాఫ్ట్‌ బ్యాంక్‌ ఈ సవరణలు చేసినట్లు సమాచారం. ఓయో హోటల్స్‌లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే యత్నాల్లో ఓయో ఉంది.

ఐపీఓ కోసం సంస్థ విలువ 9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.72,000 కోట్లు)గా ఉండాలని ఓయో లక్ష్యంగా పెట్టుకున్నట్లు, బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ ఈ ఏడాది జనవరిలో తెలిపింది. గతేడాది సెబీకి సమర్పించిన పత్రాల్లో ఐపీఓ ద్వారా రూ.8430 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నామని ఓయో పేర్కొంది.

కొవిడ్‌ పరిణామాల తరవాత వ్యాపారం పుంజుకుంటున్న నేపథ్యంలో తమ సంస్థ అంచనా విలువ తగ్గకపోవచ్చనే నమ్మకాన్ని ఓయో వ్యక్తం చేసింది. వ్యాపార పనితీరు ఆధారంగానే సంస్థ విలువను లెక్కగడతారని గుర్తు చేసింది. పబ్లిక్‌ ఇష్యూకు ఎప్పుడు రావాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని