ప్రపంచ అగ్రగామి-10 ఆహార డెలివరీ సంస్థల్లో స్విగ్గీ, జొమాటో

ప్రపంచంలో అగ్రగామి 10 ఆహార డెలివరీ కంపెనీల్లో భారతీయ సంస్థలు స్విగ్గీ, జొమాటో చోటు దక్కించుకున్నాయి. కెనడాకు చెందిన ఈటీసీ గ్రూప్‌ రూపొందించిన ఈ జాబితాలో చైనా సంస్థ మైతువాన్‌ అగ్రస్థానం పొందించింది.

Published : 23 Sep 2022 02:54 IST

దిల్లీ: ప్రపంచంలో అగ్రగామి 10 ఆహార డెలివరీ కంపెనీల్లో భారతీయ సంస్థలు స్విగ్గీ, జొమాటో చోటు దక్కించుకున్నాయి. కెనడాకు చెందిన ఈటీసీ గ్రూప్‌ రూపొందించిన ఈ జాబితాలో చైనా సంస్థ మైతువాన్‌ అగ్రస్థానం పొందించింది. రెండు, మూడు స్థానాలు బ్రిటన్‌కు చెందిన డెలివెరూ, అమెరికా సంస్థ ఉబర్‌ ఈట్స్‌ దక్కించుకున్నాయి.

* జాబితాలో నాలుగు నుంచి 8 వరకు స్థానాల్లో ఎలె.మీ, డోర్‌డ్యాష్‌, జస్ట్‌ ఈట్‌ టేక్‌అవే/గ్రబ్‌హబ్‌, డెలివరీ హీరో, ఐఫుడ్‌ సంస్థలు ఉన్నాయి.

* భారత్‌కు చెందిన స్విగ్గీ, జొమాటో 9, 10వ స్థానాల్లో నిలిచాయి. దేశంలోని 100కు పైగా యూనికార్న్‌ (రూ.8000 కోట్ల విలువైన)లలో ఇవీ ఉన్నాయి.

* వెంచర్‌ క్యాపిటల్‌, పెద్ద టెక్‌ పెట్టుబడులు ఆహార డెలివరీ సంస్థలను ముందుకు నడిపిస్తున్నాయి. కొవిడ్‌-19 పరిణామాల్లో ఆహార డెలివరీ కూడా తప్పనిసరి అవసరంగా మారింది, అయితే ఈ కంపెనీలు ఇప్పటికీ లాభాలు నమోదు చేయడం లేదు. లాభదాయకత కోసమే ఆహార డెలివరీతో పాటు సరకులు, ఔషధాల సరఫరానూ ఈ సంస్థలు ప్రారంభిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

‘ఆహార డెలివరీ రంగం వేగంగా స్థిరీకరించుకుంటోంది. యాజమాన్యాల్లో మార్పులు వస్తున్నాయి. పోటీ సంస్థల్లో వాటా కొనుగోళ్లు, అమ్మకాలు, మార్పిడులు జరుగుతున్నాయి’ అని ఈటీసీ గ్రూప్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని