36 గంటల్లో 10 లక్షల ఉత్పత్తుల విక్రయాలు: అమెజాన్‌

పండగల సందర్భంగా ప్రారంభించిన ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ మొదటి 36 గంటల్లో చిన్న, మధ్య వ్యాపారాలు (ఎస్‌ఎంఈ), అంకుర సంస్థలు, కళాకారులు, మహిళా వ్యాపారులకు చెందిన 10 లక్షల ఉత్పత్తులు అమ్ముడుపోయాయని ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌

Published : 24 Sep 2022 02:40 IST

దిల్లీ: పండగల సందర్భంగా ప్రారంభించిన ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ మొదటి 36 గంటల్లో చిన్న, మధ్య వ్యాపారాలు (ఎస్‌ఎంఈ), అంకుర సంస్థలు, కళాకారులు, మహిళా వ్యాపారులకు చెందిన 10 లక్షల ఉత్పత్తులు అమ్ముడుపోయాయని ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ప్రైమ్‌ వినియోగదార్లు 1.9 రెట్లు పెరిగారని, కొత్త వినియోగదార్లలో 68 శాతం రెండు-మూడో అంచె నగరాల నుంచే వచ్చారని తెలిపింది. అమెజాన్‌ బిజినెస్‌ విభాగం 50 శాతం వృద్ధిని, ఆర్డర్లు 100 శాతం, మొత్తం అమ్మకాలు 200 శాతం పెరిగినట్లు అమెజాన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ మనీశ్‌ తివారీ తెలిపారు. శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఎంఐ, ఎల్‌జీ, సోనీ వంటి టీవీ బ్రాండ్లకు వినియోగదారులు మొగ్గుచూపినట్లు సంస్థ తెలిపింది.


సెకనుకు 16 లక్షల మంది వినియోగదార్ల తాకిడి: ఫ్లిప్‌కార్ట్‌

బిగ్‌ బిలియన్‌ డేస్‌ విక్రయాల మొదటి రోజున తమ ప్లాట్‌ఫామ్‌పైకి సెకనుకు 16 లక్షల మంది వినియోగదార్లు వచ్చారని ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. అయితే స్పష్టమైన విక్రయ గణాంకాలను ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు. ప్రారంభ ధోరణులు చూస్తే పండగ షాపింగ్‌పై వినియోగదారు సెంటిమెంట్‌ చాలా సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మొబైళ్లు, భారీ గృహోపకరణాలు, ఫ్యాషన్, ఫర్నీచర్‌కు గిరాకీ లభిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. సులభ చెల్లింపు విధానం, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఈఎంఐ వినియోగించిన వారి సంఖ్య 12 రెట్లు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని