టీవీఎస్‌ జూపిటర్‌ క్లాసిక్‌లో ప్రత్యేక ఎడిషన్‌

టీవీఎస్‌ మోటార్‌ తన జూపిటర్‌ క్లాసిక్‌ స్కూటర్‌లో సెలబ్రిటీ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. అత్యంత వేగంగా 50 లక్షల వాహన విక్రయాలను చేరిన సందర్భంగా ఈ ఎడిషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు శుక్రవారం కంపెనీ పేర్కొంది. ప్రారంభ ధర రూ.85,866(ఎక్స్‌ షోరూం, దిల్లీ).

Published : 24 Sep 2022 02:58 IST

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ తన జూపిటర్‌ క్లాసిక్‌ స్కూటర్‌లో సెలబ్రిటీ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. అత్యంత వేగంగా 50 లక్షల వాహన విక్రయాలను చేరిన సందర్భంగా ఈ ఎడిషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు శుక్రవారం కంపెనీ పేర్కొంది. ప్రారంభ ధర రూ.85,866(ఎక్స్‌ షోరూం, దిల్లీ). స్కూటర్‌ అద్దంపై బ్లాక్‌ థీమ్, ఫెండర్‌ గార్నిష్, టింటెడ్‌ వైజర్, 3డీ బ్లాక్‌ ప్రీమియం లోగోతో ఇది వస్తోంది. డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్, ప్రీమియం లెదర్‌ సీట్లు (బ్యాక్‌రెస్ట్‌తో) ఉన్న ఈ స్కూటర్లు మిస్టిక్‌ గ్రే, రీగల్‌ పర్పుల్‌ రంగుల్లో లభ్యమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని