భారత్‌లో 2025 కల్లా రూ.5,000 కోట్ల పెట్టుబడులు

అంతర్జాతీయ ఆహార, పానీయాల దిగ్గజ సంస్థ నెస్లే ఎస్‌ఏ, రాబోయే మూడున్నరేళ్లలో అంటే 2025లోగా భారత్‌లో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందువల్ల దేశంలో కంపెనీ తన ప్రధాన వ్యాపారాలను వేగవంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని,

Published : 24 Sep 2022 02:58 IST

నెస్లే సీఈఓ మార్క్‌ ష్నైడర్‌

దిల్లీ: అంతర్జాతీయ ఆహార, పానీయాల దిగ్గజ సంస్థ నెస్లే ఎస్‌ఏ, రాబోయే మూడున్నరేళ్లలో అంటే 2025లోగా భారత్‌లో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందువల్ల దేశంలో కంపెనీ తన ప్రధాన వ్యాపారాలను వేగవంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని కంపెనీ సీఈఓ మార్క్‌ ష్నైడర్‌ పేర్కొన్నారు. మూలధన వ్యయం, కొత్త ప్లాంట్ల ఏర్పాటు, కొనుగోళ్లు, ఉత్పత్తుల విస్తరణకు ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెస్లేకు 9 ప్లాంట్లుండగా.. మరిన్ని ప్రాంతాల్లోనూ తయారీ చేపట్టనుంది. దేశీయ మార్కెట్లో ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘గత 60 ఏళ్లలో భారత్‌లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. ఇపుడు 2025లోపే మరో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న’ట్లు వివరించారు. భారత్‌లో 110 ఏళ్ల నుంచీ నెస్లే ఉంది. అయితే 1960ల నుంచే తయారీ మొదలుపెట్టిందని ఆయన వివరించారు.

ద్రవ్యోల్బణం భారత్‌లోనే మెరుగు: ఇతర దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం విషయంలో భారత మార్కెట్లో అత్యంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని ష్నైడర్‌ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక వృద్ధి భారత్‌లో బలంగా ఉండడంలో, ఇతర పెద్ద దేశాల కంటే పరిస్థితి ఇక్కడ మెరుగ్గా ఉంది. మధ్య తరగతి ఆదాయాలు పెరగడం వల్ల, గిరాకీ బలంగా ఉంద’ని ఆయన విశ్లేషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని