మీకు తెలియకుండా లావాదేవీ జరిగిందా?

బ్యాంకు ఖాతాల్లో తమకు సంబంధం లేని లావాదేవీ జరిగిందని గుర్తించిన వెంటనే వినియోగదార్లు బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో

Published : 24 Sep 2022 02:58 IST

తక్షణం కాల్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: ఎస్‌బీఐ ఛైర్మన్‌

భోపాల్‌: బ్యాంకు ఖాతాల్లో తమకు సంబంధం లేని లావాదేవీ జరిగిందని గుర్తించిన వెంటనే వినియోగదార్లు బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. వినియోగదారు సేవలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని.. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వారు సహకరించాలని కోరారు. ‘ఏదైనా అనుమానిత లావాదేవీ జరిగితే వెంటనే టోల్‌ ఫ్రీ నంబరు 18001234కు కాల్‌ చేస్తే.. సత్వరం చర్యలు తీసుకునేందుకు వీలుంటుంద’ని పేర్కొన్నారు. యోనో యాప్, ఇతర డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వినియోగదార్లకు అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నామని ఖరా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని