‘ఉత్పాదకత’పై ఐటీ యాజమాన్యాలకు ఆందోళన : సత్య నాదెళ్ల

కొవిడ్‌-19 పరిణామాల వల్ల ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడినా, ఇంటి నుంచి పనిచేయడానికే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సర్వేలో వెల్లడైంది. ఇంటి నుంచి

Published : 24 Sep 2022 02:58 IST

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాల వల్ల ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడినా, ఇంటి నుంచి పనిచేయడానికే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సర్వేలో వెల్లడైంది. ఇంటి నుంచి పని వల్ల, తమ ఉత్పాదకత పెరిగిందని 87 శాతం మంది ఉద్యోగులు చెబితే, 85 శాతం మంది మేనేజర్లు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. 12 శాతం మంది మేనేజర్లు మాత్రమే తమ ఉద్యోగుల ఉత్పాదకత తగ్గలేదని పేర్కొన్నారు. అమెరికా, భారత్, చైనా, బ్రిటన్‌ వంటి 11 దేశాల నుంచి 20,000 మందికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ‘బీబీసీ’కి తెలిపారు. యాజమాన్యాల్లో నెలకొన్న ఈ ఆందోళనను ‘ప్రొడక్టివిటీ పారనోయా’ (ఉత్పాదకత భయం)గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. అధిక గంటలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, ఉత్పాదకత ఉండటం లేదనే అపనమ్మకంతో, ఉద్యోగుల కార్యకలాపాలను పరిశీలించేందుకు యాజమాన్యాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఇందువల్ల ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య పరస్పర విశ్వాసం పోతోంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు, కంపెనీ నాయకత్వ హోదాలో ఉన్న వారు, కిందిస్థాయి ఉద్యోగులతో విధుల్లో మరింత మమేకం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్‌ వైవా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని