ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగే

మెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువు జీవన కాల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బాగానే ఉందని పేర్కొన్నారు.

Published : 25 Sep 2022 02:17 IST

నిర్మలా సీతారామన్‌

పుణె: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువు జీవన కాల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బాగానే ఉందని పేర్కొన్నారు. తీవ్ర ఒడుదొడుకులు, హెచ్చుతగ్గులకు గురి అవ్వని కరెన్సీ ఏదైనా ఉందంటే అది భారత రూపాయే అని మంత్రి వివరించారు. అమెరికా డాలరుతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలు ఎలా పడ్డాయో అధ్యయనం చేయమని ఒక విలేకరికి సూచించారు. రూపాయి పతనంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని