బ్లాక్‌స్టోన్‌కు రూ.1,840 కోట్ల బకాయిలు చెల్లించిన బైజూస్‌

ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు సంబంధించి బ్లాక్‌స్టోన్‌కు 23 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,840 కోట్లు) బకాయిలను బైజూస్‌ చెల్లించినట్లు తెలుస్తోంది. ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ను ఏప్రిల్‌లో 95 కోట్ల డాలర్ల(సుమారు రూ.7,600 కోట్లు)కు

Published : 25 Sep 2022 02:17 IST

ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ కొనుగోలు వ్యవహారం

దిల్లీ: ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు సంబంధించి బ్లాక్‌స్టోన్‌కు 23 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,840 కోట్లు) బకాయిలను బైజూస్‌ చెల్లించినట్లు తెలుస్తోంది. ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ను ఏప్రిల్‌లో 95 కోట్ల డాలర్ల(సుమారు రూ.7,600 కోట్లు)కు బైజూస్‌ కొనుగోలు చేసింది. ఆకాశ్‌ వ్యవస్థాపకుడికి జులైలో చెల్లింపులు చేయగా.. పరస్పర ఒప్పందం కింద బ్లాక్‌స్టోన్‌కు చెల్లింపులను వాయిదా వేసింది. ఒప్పందం ప్రకారం.. సుమేరూ వెంచర్స్‌, ఆక్స్‌షాట్‌ నుంచి నిధులు రాకపోవడం వల్లే బ్లాక్‌స్టోన్‌కు చెల్లింపులు చేయలేకపోయామని బైజూస్‌ చెబుతూ వచ్చింది. ఈ రెండు పెట్టుబడుల సంస్థల నుంచి ఒప్పంద హామీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, గత ఆరు నెలల్లో ఈ సంస్థల నుంచి ఎటువంటి పెట్టుబడులు రాలేదని ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజూ రవీంద్రన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని